గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు

  • అంతర్జాతీయ మార్కెట్లో కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు
  • చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం
  • 13.65 శాతం వరకు పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు
కరోనా దెబ్బకు మార్కెట్లు కుదేలవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కుప్పకూలడం... చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 13.65 శాతం వరకు పడిపోయింది. గత పదేళ్ల కాలంలో ఒక ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు జామ్ నగర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రూడాయిల్ రిఫైనరీ పరిశ్రమ ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున చమురు వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు కుప్పకూలాయి. మధ్యాహ్నం 2.14 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12.05 శాతం నష్టంతో  రూ. 1,117 వద్ద కొనసాగుతున్నాయి.


More Telugu News