రాష్ట్ర విభజన చట్టం అమలుపై.. మోదీ, జగన్‌కు కేవీపీ లేఖలు
- రాష్ట్రానికి పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వాలి
- వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ కావాలి
- పోలవరం కోసం రాష్ట్రం ఎందుకు అప్పులు తేవాలి?
రాష్ట్ర విభజన చట్టం అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం జగన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. రాష్ట్రానికి పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వాలని ప్రధాని మోదీని కేవీపీ కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇంతగా నష్టపోతోంటే ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకోవడం రాజకీయ నేతలకు సబబు కాదని చెప్పారు. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని జగన్ నిలదీయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పజెప్పితే మంచిదని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రుణాలు తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని చెప్పారు.