దేశంలో 'కరోనా' కేసులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన

  • ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42 కరోనా పాజిటివ్‌ కేసులు 
  • ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి 
  • కేరళలోని పథనంతిట్టాలో విద్యా సంస్థలకు మూడు రోజుల సెలవులు  
దేశంలో 'కరోనా' కేసులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్‌ తెలిపారు.

కాగా, ఇటీవల విదేశాల నుంచి కేరళలోని పథనంతిట్టాకు వచ్చిన ఓ కుటుంబంలోని ఐదుగురికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో పథనంతిట్టాలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. అయితే, పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు. కాగా, కరోనా సోకిన ఆ ఐదుగురికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులో వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు మేరకు బెంగళూరు నార్త్‌, సౌత్‌, గ్రామీణ జిల్లాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ పాండే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.


More Telugu News