'శీనయ్య' ప్రాజెక్టు ఆగిపోలేదట

  • మాస్ డైరెక్టర్ గా వినాయక్ కి మంచి క్రేజ్ 
  • 'శీనయ్య'తో కథానాయకుడిగా ఎంట్రీ 
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు   
హీరోల మాస్ ఇమేజ్ ను మరింత పెంచిన దర్శకులలో వినాయక్ ఒకరు. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని రకాల అంశాలు తన సినిమాల్లో ఉండేలా ఆయన చూసుకుంటాడు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కథను పరుగులు తీయించడం ఆయన ప్రత్యేకత. అలాంటి వినాయక్ హీరోగా మారిపోయాడు .. 'శీనయ్య' టైటిల్ తో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.

'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి నరసింహారావు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతవరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. ఆ తరువాత అవుట్ పుట్ పట్ల వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదట. ఒక వైపున స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూనే, మరో వైపున షూటింగును తిరిగి ఆరంభించాలనే నిర్ణయానికి 'దిల్' రాజు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో ఈ సినిమా షూటింగు తిరిగి ప్రారంభం కానున్నట్టుగా సమాచారం.


More Telugu News