వేటకు వెళ్లిన తల్లి... అనాధలైన చిరుత కూనలు... హైదరాబాద్ జూకు కూన!

  • స్థానికులకు కనిపించిన రెండు కూనలు
  • అధికారులు వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఓ కూన
  • రెండో కూన కోసం గాలింపు
ఓ చిరుత పులి వేటకు వెళ్లింది. దీంతో దాని పిల్లలు అనాధలుగా మిగిలి చెట్టు తొర్రలో నుంచి బయటకు వచ్చాయి. వాటిని చూసిన సమీప గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి, తల్లి ఆ ప్రాంతంలో లేదని గుర్తించారు. రెండు చిరుత కూనలు ఉండాలని, కానీ ఒకటే ఉందని గమనించి, బిక్కుబిక్కుమంటున్న దాన్ని హైదరాబాద్ జూ పార్కుకు తరలించారు.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం, భవానీ పేట సమీపంలో జరిగింది. ఇక్కడి తాటివాని మత్తడి వాగు పక్కనే ఉన్న చెట్టు తొర్రలో నిన్న రెండు చిరుత కూనలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ రేంజర్ చంద్రకాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అటు వచ్చేసరికి ఒకటే కూన ఉంది. దీంతో దాన్ని హైదరాబాద్ కు తరలించారు. రెండో కూన కనిపించే వరకూ గస్తీ నిర్వహిస్తామని, తొర్ర సమీపంలో సీసీ కెమెరాలు అమర్చామని ఆయన వెల్లడించారు.


More Telugu News