కనిపించకుండా పోయిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే తిరిగొచ్చారు!
- అదృశ్యమైన ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు రాక
- ఆచూకీ లేని మరో ఇద్దరు
- ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ ప్లాన్ విఫలమైందన్న కాంగ్రెస్
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిసాహులాల్ సింగ్ నిన్న తిరిగి భోపాల్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు. బెంగళూరు నుంచి విమానంలో భోపాల్ చేరుకున్న ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నివాసానికి వెళ్లి కలిశారు.
మధ్యప్రదేశ్‌లో ఇటీవల రాజకీయాలు వేడెక్కాయి. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, అదృశ్యమైన ఎమ్మెల్యేల్లో తొలుత ఆరుగురు వెనక్కి రాగా, నిన్న ఓ స్వతంత్ర ఎమ్మెల్యే సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే బిసాహులాల్ వెనక్కి వచ్చారు. మరో ఇద్దరు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోం మంత్రి బాల బచ్చన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాకతో ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ కుట్ర విఫలమైందన్నారు.