తిరుమల భక్తులపై కరోనా, పరీక్షల ప్రభావం... బోసిపోయిన ఏడు కొండలు!
- ఒకే కంపార్టుమెంట్ లో భక్తులు
- దర్శనానికి మూడు గంటల సమయం
- నిన్న 80 వేల మందికి దర్శనం
తిరుమల గిరులపై కరోనా ప్రభావంతో పాటు, ఈ విద్యా సంవత్సరం సీజన్ లో తుది పరీక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక, సోమవారం నాడు రద్దీ మరింతగా తగ్గింది.
ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామి వారి అన్ని రకాల దర్శనాలకూ రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఆదివారం నాడు స్వామిని 79,464 మంది భక్తులు దర్శించుకున్నారని, 28,104 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ. 2.97 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ఏప్రిల్ తొలి వారం వరకూ రద్దీ సాధారణంగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.