కొత్త మలుపు తిరిగిన నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడి మృతి... మరో అన్న అరెస్ట్!

  • ఇటీవల కనకసబై ఆత్మహత్య
  • తాజాగా పోలీసుల చేతిలో సూసైడ్ లెటర్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ దక్షిణాది నటుడు, విలన్ పాత్రలతో మెప్పించిన ఆనంద్ రాజ్ సోదరుడు కనకసబై ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఇటీవల కనకసబై సూసైడ్ చేసుకున్నట్టు కేసు నమోదు కాగా, తాజాగా ఆయన ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది. దీని ఆధారంగా ఆనంద్ రాజ్ మరో సోదరుడు భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాను మరణించడానికి మరో అన్నయ్య భాస్కర్, అతని కొడుడు శివచంద్రన్ కారణమని ఈ లేఖలో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, జైలుకు తరలించారు. కాగా, కనకసబైకి వ్యాపార నష్టాలు లేవని, ఇటీవల ఓ ఇంటిని కొనుగోలు చేయడంతో దాన్ని కాజేసేందుకు కొందరు కుట్ర చేశారని ఆనంద్ రాజ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మనస్తాపంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అన్నారు.


More Telugu News