ఎన్పీఆర్ లో ఎవరినీ పత్రాలు అడగబోము: కిషన్ రెడ్డి

  • సమగ్ర కుటుంబ సర్వేలో అడిగిన వివరాలే అడుతారని వెల్లడి
  • గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పిన కిషన్ రెడ్డి
  • కేసీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
నా బర్త్ సర్టిఫికెట్టే లేదు, ఇంక మా నాయనది ఎక్కడ్నించి తెస్తాం అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్పీఆర్ లో భాగంగా ఎవరినీ పత్రాలు అడగబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కూడా మనవి చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఏ వివరాలు అడిగారో ఎన్పీఆర్ లో కూడా అవే వివరాలు అడుగుతారని వివరించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీఏఏతో ఏ విధంగా దేశ గౌరవానికి భంగం కలుగుతుందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. సీఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ ఏది రాసిస్తే దాన్నే కేసీఆర్ చదువుతున్నారని ఆరోపించారు.


More Telugu News