ఇంకా సీఎం జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తారు?: పంచుమర్తి అనూరాధ
- జగన్ తనకు చెల్లెలు వరుస అయ్యే సునీతకే న్యాయం చేయలేదు
- వైసీపీ ప్రభుత్వ పాలనలో 180 మంది మహిళలపై అత్యాచారాలు
- నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే యత్నం చేశారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు చెల్లెలు వరుస అయ్యే వైఎస్ వివేకా కూతురు సునీతకే న్యాయం చేయని జగన్, ఇంకా, మహిళలకు ఏం న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది మహిళలపై, 33 మంది చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నిరసనలు వ్యక్తం చేసిన రాజధాని ప్రాంత మహిళలపై 2800 కేసులు బనాయియించారని విమర్శించారు. దిశ పోలీస్ స్టేషన్ లో పని చేసే ఓ హోంగార్డు ఓ యువతిపై అత్యాచారం చేస్తే విచారణ జరపలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే యత్నం చేశారని, ‘ నా పరువు తీసే ప్రయత్నం చేశారు’ అని మండిపడ్డారు.