నియంతను కట్టడి చేద్దాం...ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుందాం: నారా లోకేశ్​

  • ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు
  • ఒక్క ఛాన్స్ అడిగాడు.. నట్టేట ముంచాడు’
  • ఈ 10 అంశాలపై ఆలోచించిన తర్వాతే ‘ఓటు’ వేయండి
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీకే  ‘ఓటు’ వేయాలని ఆయా పార్టీల నేతలు కోరుకుంటున్నారు. తాజాగా, టీడీపీ నేత నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘నియంతను కట్టడి చేద్దాం.. ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుందాం’ అంటూ పోస్ట్ చేసిన లోకేశ్, ‘ఒక్క ఛాన్స్ అడిగాడు.. నట్టేట ముంచాడు.. విధ్వంసం చేశాడు’ అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఈ పది అంశాలపై ప్రజలు ఆలోచించిన తర్వాతే  ‘ఓటు’ వేయండి అంటూ ఆ జాబితాను పొందుపరిచారు.


More Telugu News