ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘కరోనా‘ కాలర్ ట్యూన్
- ఈ కాలర్ ట్యూన్ ద్వారా..
- ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తుంది
- ఈ వైరస్ కు సంబంధించిన తాజా సమాచారం,హెల్ప్ లైన్ నెంబర్లు
కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లో ‘కరోనా’ కాలర్ ట్యూన్ గా వినిపిస్తోంది. ఈ వైరస్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కాలర్ ట్యూన్ ద్వారా వివరించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కు సంబంధించిన తాజా సమాచారం, హెల్ప్ లైన్ నెంబర్లు, ఇతర వివరాలను ఇందులో పొందుపరిచారు.
బీఎస్ఎన్ ఎల్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో, ఇతర నెట్ వర్క్స్ పాక్షికంగా సంబంధింత సమాచారాన్ని అందుబాటులో ఉంచాయి. అన్నీ నెట్ వర్క్స్ ఈ కాలర్ ట్యూన్ ను ఉచితంగానే అందిస్తున్నాయి. ఇంతకుముందే తమకు నచ్చిన కాలర్ ట్యూన్ ను సెట్ చేసుకున్నవారి మొబైల్స్ నుంచి మాత్రం ‘కరోనా’ ట్యూన్ వినిపించడం లేదు. కాగా, నిన్నటి నుంచి మొబైల్స్ లో కాలర్ ట్యూన్ గా ‘కరోనా’ వినిపిస్తోంది.