భార్య క్యాన్సర్ తో చనిపోయిన తర్వాత మళ్లీ ప్రేమలో పడిన టాలీవుడ్ విలన్
- నటి ముగ్ధా గాడ్సేతో రాహుల్ దేవ్ రొమాన్స్
- ఇద్దరి మధ్య 18 ఏళ్ల వయోభేదం
- అదేమీ పెద్ద విషయం కాదన్న రాహుల్ దేవ్
- తన ప్రేమ విషయం కుమారుడికి కూడా తెలుసని వెల్లడి
తెలుగులో అనేక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కండలు తిరిగిన దేహంతో వయసును తెలియనివ్వని రాహుల్ దేవ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన తెలుగులోనే కాదు బాలీవుడ్ సహా అనేక భాషల చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, రాహుల్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డారు. 51 ఏళ్ల రాహుల్ దేవ్ 33 ఏళ్ల మోడల్, నటి ముగ్ధా గాడ్సేతో డేటింగ్ చేస్తున్నారు. రాహుల్ కు సిద్ధార్థ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే రాహుల్ భార్య రయీనా కొన్నాళ్ల కిందట క్యాన్సర్ తో కన్నుమూసింది. రయీనా, రాహుల్ చిన్ననాటి స్నేహితులు. వీరి వివాహం 1998లో జరిగింది. కొడుకు పుట్టిన 11 ఏళ్లకు రయీనాకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. దాంతో సినిమాలకు విరామం ఇచ్చిన రాహుల్ దేవ్ భార్య చెంతనే ఉంటూ ఆమె బాగోగులు చూసుకున్నారు. కానీ, క్యాన్సర్ ముదరడంతో ఆమె 2009లో మరణించింది. దాంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన రాహుల్ దేవ్ కొడుకు కోసం మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో ఆయనకు ఓ పెళ్లిలో ముగ్ధాతో పరిచయం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ విషయం తన తల్లిదండ్రులకే కాకుండా, ముగ్ధా పేరెంట్స్ కు కూడా తెలుసని, తమ ఇద్దరి మధ్య 18 ఏళ్ల గ్యాప్ ఉన్నా అదేమీ పెద్ద విషయం అనుకోవడంలేదని రాహుల్ దేవ్ పేర్కొన్నారు. తన కొడుకు సిద్ధార్థ్ కు కూడా తన ప్రేమ విషయం తెలుసని అన్నారు.