మారుతీరావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు: పోలీసులు
- మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
- మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగింత
- ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ప్రణయ్ హత్య విషయంలో తనపై మోపిన కేసుల ఒత్తిడితోనే మారుతీరావు బలవన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ మధ్యాహ్నం మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మారుతీరావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలిందని చెప్పారు.
అనుమానాస్పద మృతిపై సమాచారం అందిన తర్వాత తమ క్లూస్ టీమ్ ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో తనిఖీలు నిర్వహించాయని, మారుతీరావు బెడ్ పై విగతజీవిగా పడివున్నాడని వెల్లడించారు. అక్కడే సూసైడ్ నోట్ లభ్యమైందని, అందులో అమృతా, అమ్మ దగ్గరికి వచ్చేయమ్మా... గిరిజా నన్ను క్షమించు అనే వాక్యాలు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. కాగా, మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆయన కుటుంబీకులకు అందజేయగా, వారు స్వస్థలం మిర్యాలగూడ తరలించారు.