ఆ నిధులు జీతాలకే సరిపోవు: బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
- విద్యా రంగంపై సర్కారు నిర్లక్ష్యం
- ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఇచ్చిన నిధులు బకాయిలకే చాలవు
- ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్
తెలంగాణ బడ్జెట్ లో విద్యా రంగంపై తీవ్రంగా నిర్లక్ష్యం చూపారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ఇది పూర్తిగా నిరాశాజనక బడ్జెట్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఎవరికీ కూడా ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఈ బడ్జెట్ తీరును తప్పుపడుతోందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో మాయ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇప్పటికే కాలేజీలకు రూ.6 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం రూ. 2,600 కోట్లే కేటాయించిందన్నారు. మరి ఎందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు, ఎంత మందికి ఇవ్వరో తెలియడం లేదన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులేవి?
విద్యా రంగానికి అరకొర కేటాయింపులే చేశారని, దానికి చేసిన కేటాయింపులు టీచర్ల జీతాలకే సరిపోవని రాంచందర్ రావు మండిపడ్డారు. కొత్త భవనాలు నిర్మించడానికి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించడానికి నిధులు ఏవని నిలదీశారు. విద్యా రంగానికి బడ్జెట్ ను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇప్పటికే కాలేజీలకు రూ.6 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం రూ. 2,600 కోట్లే కేటాయించిందన్నారు. మరి ఎందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు, ఎంత మందికి ఇవ్వరో తెలియడం లేదన్నారు.