పాలనపై నమ్మకం లేకే జగన్ అడ్డదారులు తొక్కుతున్నారు: కన్నా విసుర్లు
- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
- గంటగంటకు రిజర్వేషన్లలో మార్పులు చేయడం సరికాదన్న కన్నా
- వైసీపీ దౌర్జన్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని వెల్లడి
- పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని హితవు
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పాలనపై నమ్మకం లేకే జగన్ అడ్డదారుల్లో పయనిస్తున్నారని ఆరోపించారు. గంటగంటకు రిజర్వేషన్లలో మార్పులు చేయడం సరికాదని అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేయాలని, వైసీపీ దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల బరిలో దిగితే ఎర్రచందనం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కన్నా ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది.