తొలి ఓవర్లోనే క్యాచ్ డ్రాప్.. భారీ షాట్లతో చెలరేగుతున్న ఆసీస్​ ఓపెనర్

  • 11 ఓవర్లలోనే వంద దాటిన స్కోరు
  • భారత్‌తో ఫైనల్లో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
  • నిరాశ పరుస్తున్న టీమిండియా బౌలర్లు
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. భారత్‌తో ఎంసీజీలో మొదలైన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 11 ఓవర్లలోనే  వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ భారీ షాట్లతో విజృంభిస్తోంది. బౌండ్రీతో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన హీలీ ఐదో బంతికే ఇచ్చిన క్యాచ్‌ను భారత యువ ఓపెనర్ షెఫాలీ వర్మ కవర్స్‌లో డ్రాప్ చేసింది.

ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న హీలీ వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదేస్తోంది. 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది. శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లతో విజృంభించింది. మరో ఓపెనర్ బెత్ మూనీ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. భారత బౌలర్లు నిరాశ పరుస్తుండడంతో ఆసీస్‌ 200 రన్స్ చేసేలా కనిపిస్తోంది.


More Telugu News