తెలంగాణ బడ్జెట్​: ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు

  • నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా కేటాయింపు
  • ఎమ్మెల్సీలకు కూడా ఇవ్వాలని నిర్ణయం
  • ఇందుకోసం బడ్జెట్ లో రూ.480 కోట్లు కేటాయింపు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేసుకునేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.480 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
‘‘ప్రజల చేత చట్టసభలకు ఎన్నికై, రాష్ట్ర అభివృద్ధికి విధానాలు రూపొందించే వారు ఎమ్మెల్యేలు. అంతటి గురుతర బాధ్యత నిర్వర్తించే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో సొంత కార్యాలయాలు ఉండాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఇప్పటివరకు 82 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాం.” అని హరీశ్ రావు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హరీశ్ రావు తెలిపారు. ‘‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వనున్నాం. వాటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధుల కోసం మొత్తంగా రూ. 480 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నాం..” అని వివరించారు.


More Telugu News