హైదరాబాద్​ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. తెలంగాణ బడ్జెట్​ లో రంగాల వారీగా నిధుల లెక్కలివీ..

  • రుణ మాఫీకి 6,225 కోట్లు కేటాయింపు
  • ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు
  • సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్ లో పలు కీలక రంగాలకు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర వర్గాల వారికి ఇచ్చే పెన్షన్ల కోసం రూ. 11,758 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంట రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్ లో రూ. 6,225 కోట్లు నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. 5,83,916 మంది రైతులు కేవలం రూ. 25 వేలలోపు రుణం తీసుకున్నారని.. వారికి చెక్కుల పంపిణీ కోసం రూ.1,198 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రాజీవ్ స్వగృహతో పాటు ఇతర నిరర్థక ఆస్తులు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కొన్ని ప్రాధాన్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా.. 

  • గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు

  • హైదరాబాద్ అభివృద్ధి కి రూ.పది వేల కోట్లు

  • విద్యుత్ శాఖ కు రూ. 10,416 కోట్లు

  • పాఠశాల విద్య కు రూ.10,421 కోట్లు

  • ఆర్టీసీకి సహాయం కింద రూ. వెయ్యి కోట్లు

  • పారిశ్రామిక రంగం అభివృద్ధికి రూ. 1,998 కోట్లు

  • వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు

  • ఉన్నత విద్యకు రూ. 1,723 కోట్లు

  • ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ. 2,650 కోట్లు

  • మున్సిపల్ శాఖ కు రూ. 14,809 కోట్లు

  • సాగునీటికి రూ. 11,054 కోట్లు

  • పంచాయతీరాజ్ కు, గ్రామీణాభవృద్ధికి రూ. 23,005 కోట్లు

  • ఎం.బి.సి కార్పొరేషన్ కి రూ. 500 కోట్లు

  • వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం రూ. 4,356 కోట్లు

  • ఈచ్ వన్ టీచ్ వన్ కు రూ.100 కోట్లు



More Telugu News