నల్లగా అయిపోయావంటుంటారు: మేకప్ వేసుకోకుండా వీడియో తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
- మేకప్ వేసుకోకపోతే ఎలా అనుకున్నాను
- అయినా ఇలాగే వీడియో తీసుకున్నాను
- కొందరు మహిళలు ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారు
- వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారు
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సందేశమిస్తూ యాంకర్ సుమ మేకప్ లేకుండా వీడియో తీసుకుని పోస్ట్ చేసింది. కావాలనే మేకప్ లేకుండా వీడియో తీస్తున్నానని తెలిపింది. మహిళలపై ఎలాంటి కామెంట్లు వచ్చినా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చింది.
'మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వీడియో పెట్టాలని అనుకున్నాను. ఓ ఆలోచన వచ్చింది. ఈ రోజు మేకప్ వేసుకోలేదు కదా.. వేసుకోకపోతే ఎలా అనుకున్నాను. అయితే, మేకప్ లేకపోతే సుమ ఇలా ఉంటుంది.. కళ్లేంటి కొంచెం డల్‌గా ఉన్నాయి? అని రకరకాలుగా అంటారు. ఇది నా కష్టార్జితం. రెమ్యునరేషన్‌తో పాటు ముఖం ఇలా మారిపోతూ ఇలాంటి ప్రతిఫలాలు కూడా వస్తుంటాయి' అని సుమ తెలిపింది.
ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారు.. వారిపై కూడా కామెంట్లు
'ఇలా ఎంతో మంది మహిళలు తమ ఇంటిని, వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారు. వారిపై కామెంట్లు చేస్తుంటారు. ఏంటీ నల్లబడ్డావు.. బాగా చిక్కిపోయావేంటీ? బాగా లావయ్యావేంటీ? అంటుంటారు. బయటి నుంచి వచ్చే కామెంట్లను మనం మార్చలేం. ఎలాంటి కామెంట్లు వచ్చినా మనం ఇలాగే ఉండాలి. ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా మహిళలంతా మారొద్దు.. ఆనందంగా ఉండండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అని సుమ సందేశాన్నిచ్చింది.