నిన్నటి కొవిడ్-19 గణాంకాలు.. విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేస్తుండగా గుర్తింపు
  • 19 మందికి పరీక్షలు జరిపించిన అధికారులు
  • ఐదుగురికి నెగిటివ్.. మిగతా 14 మంది రిపోర్టుల కోసం వేచిచూపు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం నిన్న  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా 19 మందిలో కరోనా లక్షణాలను గుర్తించారు. దాంతో, వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి  పరీక్షించగా ఐదుగురి రిపోర్టులు నెగిటివ్ గా వచ్చాయి. మరో 14 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 31,763 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించారు. శనివారం ఒక్క రోజే 4,656 మందిని పరీక్షించామని తెలిపారు.


More Telugu News