ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
  • ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య
  • నిన్ననే ఓ గది అద్దెకు తీసుకున్న వైనం
  • ప్రణయ్ హత్య కేసులో కీలక సూత్రధారి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్‌లోని వాసవీ భవన్‌లో గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతల్‌బస్తీలో ఉన్న ఈ భవన్‌లో మారుతీరావు నిన్ననే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఉదయం అపస్మారక స్థితిలో పడివున్న మారుతీరావును చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి అయిన మారుతీరావు.. ప్రణయ్ హత్యకేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తన కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయిన మారుతీరావు 2018లో ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మారుతీరావు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు.


More Telugu News