‘కరోనా’ నివారణకు టీటీడీ చర్యలు
- జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న భక్తులకు థర్మల్ స్క్రీనింగ్
- అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక వైద్య బృందాలు
- ‘కరోనా’పై భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రోమోల రూపకల్పన
కరోనా వైరస్ నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న భక్తులను థర్మల్ స్క్రీనింగ్ ద్వారా గుర్తించి వైద్యం అందించనుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది. ‘కరోనా’పై భక్తులకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రోమోలను రూపొందించాలని, రద్దీ ప్రాంతాల్లో అంటురోగ నివారణ మందులతో శుభ్రం చేయాలని టీటీడీ నిర్ణయించింది.