అయోధ్య రామమందిరానికి ఉద్ధవ్ థాకరే రూ.కోటి విరాళంపై అసదుద్దీన్ వ్యాఖ్యలు
- ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ
- మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ ఓడినా హిందుత్వమే గెలిచిందని వ్యాఖ్యలు
- శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఎప్పటికీ లౌకికవాద కూటమి కాలేదని వెల్లడి
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి రూ.కోటి విరాళం ఇస్తామని ప్రకటించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. విడిపోయింది బీజేపీతోనే కానీ, హిందుత్వంతో కాదని ఉద్ధవ్ థాకరే అయోధ్యలో చేసిన వ్యాఖ్యల ద్వారా నిరూపించారని ఒవైసీ ట్వీట్ చేశారు.
బీజేపీ మహారాష్ట్ర, ఢిల్లీలో ఓటమిపాలైనా హిందుత్వం మాత్రం గెలిచిందని పేర్కొన్నారు. హిందుత్వమే ప్రధాన అజెండాగా మహారాష్ట్రలో శివసేన పార్టీ, కాంగ్రెస్, ఎన్సీపీ జట్టు కట్టి కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. హిందుత్వం ప్రాతిపదికన ఏర్పడిన ఆ కూటమి హిందుత్వ కూటమి అనిపించుకుంటుందే తప్ప బహుజన, లౌకిక కూటమి ఎప్పటికీ కాబోదని స్పష్టం చేశారు.