అశోక్ గజపతిరాజు మసీదు, చర్చిలకు ఎప్పుడూ వెళ్లలేదా?: సంచయిత
- మరింత ముదురుతున్న మాన్సాస్ ట్రస్టు వివాదం
- ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్న అశోక్ గజపతిరాజు, సంచయిత
- బాబాయ్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న సంచయిత
ఏపీలో మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు కాక రేపుతున్నాయి. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్న కుమార్తె సంచయితకు బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ, అన్యమతస్తుల జోక్యం ఏంటని అశోక్ గజపతిరాజు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంచయిత స్పందించారు. తాను హిందువునని, తన మతం గురించి బాబాయ్ అశోక్ గజపతిరాజు మాట్లాడడం బాధ కలిగిస్తోందన్నారు.
వాటికన్ సిటీ వెళ్లి ఫొటో దిగితే క్రిస్టియన్ అవుతానా? అంటూ ప్రశ్నించారు. అయినా, అశోక్ గజపతిరాజు మసీదులకు, చర్చిలకు ఎప్పుడూ వెళ్లలేదా? అని నిలదీశారు. గతంలో ట్రస్టు బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి స్థానం కల్పించారని, ఆ రోజు తాను కనిపించలేదా? అని ప్రశ్నించారు. ట్రస్టు చైర్ పర్సన్ గా తన పనితీరును చూసి మాట్లాడాలని హితవు పలికారు. తనపై విమర్శలు చేసే వారికి తానిచ్చే సమాధానం ఇదేనని అన్నారు.