'నిఘా' యాప్ ను ఆవిష్కరించిన సీఎం జగన్

  • మరికొన్నిరోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించే యాప్
  • మద్యం, నగదు పంపిణీపై అధికారులకు సమాచారం అందించే వెసులుబాటు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో సీఎం జగన్ 'నిఘా' యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సామాన్యుడు ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీపై సాధారణ పౌరులు 'నిఘా' యాప్ ను ఉపయోగించుకుని అధికార వర్గాలకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తగితరులు పాల్గొన్నారు.


More Telugu News