రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టయి జైలుకెళ్లారు: కర్నె ప్రభాకర్ 

  • గోపన్ పల్లి భూ ఆక్రమణలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త నాటకానికి తెర లేపారు
  • డ్రోన్లను ఎగురవేయడం చట్టరీత్యా నేరం
  • చట్టాలు తెలిసిన వారు కూడా వాటిని పాటించడం లేదు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఆజాద్, కుంతియాలు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. గోపన్ పల్లి భూ ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టయి జైలుకు వెళ్లారని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చట్టాలు తెలిసిన వారు కూడా వాటిని పాటించకపోవడం దురదృష్టకరమని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు.


More Telugu News