తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం కేసీఆర్ ప్రసంగం
- ఈ ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ సభ్యులు
- భట్టి, కోమటిరెడ్డి , శ్రీధర్ బాబు సహా మరో ముగ్గురు ఒక్కరోజు సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క లను సమావేశాల నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేశారు.
సభ సవ్యంగా సాగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్ లు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని ఏమాత్రం కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. దీంతో, కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కేసీఆర్ కోరగా, సస్పెన్షన్ తీర్మానాన్ని సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెట్టారు.