కేటీఆర్ కు ఫామ్ హౌస్ లేదు.. లీజుకు తీసుకుని ఉంటున్నారు: తలసాని
- రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం
- 111 జీవోను ఎత్తేయాలనే డిమాండ్ ఉంది
- జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ తో చిత్రీకరించారనే అభియోగాలతో కేసు నమోదైంది. ఈ అంశంపై మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కేటీఆర్ కు ఫామ్ హౌస్ లేదని... వేరే వాళ్లు కట్టుకున్న ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకుని ఉంటున్నారని తెలిపారు. 111 జీవోను ఎత్తేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని... ఈ జీవోను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ, జనాభాను బట్టి వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.