'ఉప్పెన' సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది

  • 'ఉప్పెన'తో హీరో హీరోయిన్ల పరిచయం 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • ఏప్రిల్ 2వ తేదీన విడుదల  
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల ఒక సాంగ్ ను వదిలారు. 'నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం .. ' అంటూ సాగిన ఈ పాట యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

జావేద్ అలీ .. శ్రీకాంత్ చంద్ర ఆలపించిన ఈ పాట ఖవ్వాలి తరహాలో సాగుతూ మనసులను పట్టేసింది. దాంతో యూట్యూబ్ లో వదిలిన ఐదు రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ ను దాటడం విశేషం. 1.42 లక్షల లైక్స్ ను సంపాదించుకుంది. చాలా తక్కువ సమయంలో ఈ పాటకి ఈ స్థాయి ఆదరణ లభించడం విశేషం. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేస్తున్నారు.


More Telugu News