సముద్రంలో దొరికిన సీసాలోని ద్రవాన్ని తాగి ఇద్దరు మత్స్యకారుల మృతి
- ప్రకాశం జిల్లాలో ఘటన
- చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు
- నీటిపై తేలుతూ కనిపించిన సీసా
- అందులో ఉన్నది మద్యం అనుకుని తాగిన వైనం
ప్రకాశం జిల్లా మత్స్యకార సమాజంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపలవేట సాగిస్తుండగా, ఓ సీసా దొరకడంతో అందులో ఉన్నది మద్యం అనుకుని తాగి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లారు.
నడిసముద్రంలో వీరు ప్రయాణిస్తున్న పడవకు సమీపంగా ఓ సీసా నీటిపై తేలుతూ కనిపించింది. అందులో ఏదో ద్రవం ఉండడంతో దాన్ని మద్యంగా భావించారు. ఆ సీసా తీసుకుని అందులో ఉన్న ద్రవాన్ని తాగడంతో వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో మత్స్యకారుడు అస్వస్థతకు గురవడంతో ఇతర పడవల్లో ఉన్న మత్స్యకారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ సీసాలో ఉన్నది ప్రమాదకర రసాయనం అని భావిస్తున్నారు.