తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ
- త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన
- హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశం
- గత డిసెంబర్‌లోనే పరిశీలనకు వచ్చిన కేంద్ర వైద్య బృందం
తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో త్వరలోనే ఎన్‌సీడీసీ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. దీన్ని హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల బృందం గత డిసెంబర్‌లోనే నగరానికి వచ్చింది. ఎన్‌సీడీసీ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించింది. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయ ఆవరణలో ఉన్న ఓ భవనాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ బృందానికి తెలిపింది. అయితే, ఆ భవనం ఎన్‌సీడీసీకి అనువుగా లేదని అధికారుల బృందం పేర్కొన్నది.