అందుకే ఉద్యోగిని మోనికాతో సంబంధం పెట్టుకుని తప్పు చేశాను!: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్
- అమెరికా అధ్యక్షుడిగా అప్పట్లో చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నా
- ఉపశమనం పొందడానికి మోనిక లెవిన్స్కీతో సంబంధం
- అసంతృప్తికి, భయాందోళనలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి
- మనిషి చేయకూడని పనులు చేస్తుంటాడు
అమెరికా అధ్యక్షుడిగా అప్పట్లో చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని, దీంతో దాని నుంచి ఉపశమనం పొందడానికి మోనిక లెవిన్స్కీతో సంబంధం పెట్టుకున్నానని బిల్ క్లింటన్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
తాను అసంతృప్తికి, భయాందోళనలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ అధిగమించి, మనసుకు ప్రశాంతత, ఉపశమనం పొందేందుకే ఇటువంటి పని చేశానని తెలిపారు. అయితే, కొన్ని విషయాలు మనుషులని జీవితాంతం వెంటాడుతుంటాయని, మనిషి చేయకూడని పనులు చేస్తుంటాడని చెప్పారు. తాను ఆనాడు చేసింది తప్పేనని అంగీకరించారు.
ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడినని తెలిపారు. కాగా, 1993 జనవరి నుంచి 2001 జనవరి వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. మోనికతో ఎఫైర్ ఆయన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో పరిణామాలకు దారితీసింది.
అప్పట్లో మోనికా లెవిన్స్కీ వయసు 22 ఏళ్లు. ఆమె అప్పుడు వైట్‌హౌస్‌లో ఉద్యోగం చేసేవారు. ఎఫైర్ కారణంగా ఆయన 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.