పుకార్లను ఏమాత్రం పట్టించుకోవద్దు.. నమస్తే పెట్టండి!: మోదీ సలహా
- కరోనా పుకార్లతో ఎవరూ భయపడొద్దు
- షేక్ హ్యాండ్ కంటే నమస్తే పెట్టడం అత్యుత్తమం
- వైద్యుల సలహాతో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి
కరోనా వైరస్ కు సంబంధించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, వాటిని పట్టించుకోవద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్న ఇలాంటి సమయాలలో పుకార్లు కూడా చాలా వేగంగా విస్తరిస్తాయని ఆయన అన్నారు.
ఇది తినొద్దు, అది చేయొద్దులాంటి సలహాలను చాలా మంది ఇస్తుంటారని... మరికొందరు ఇది తింటే కరోనా రాదని చెబుతారని... ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. 'మీరు ఏది కావాలనుకుంటే అది చేయండి... కాకపోతే వైద్యుల సలహా మేరకు దాన్ని చేయండి' అని తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలకు చెందిన వ్యక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆయన ఈ సూచనలు చేశారు.
కుటుంబంలో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకితే ఇంట్లోని అందరికీ అది సోకే అవకాశం ఉందని.. అందువల్ల అందరూ మాస్కులు ధరించాలని, చేతికి గ్లోవ్స్ వేసుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు.
షేక్ హ్యాండ్ కంటే నమస్తే పెట్టడమే అత్యుత్తమమని మోదీ చెప్పారు. కొన్ని కారణాల వల్ల నమస్తే చెప్పడాన్ని మనం వదిలేసినా... మళ్లీ ఆ అలవాటును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని మోదీ చెప్పారు. ప్రపంచం మొత్తం నమస్తే చెప్పడాన్ని అవవర్చుకోవాలని సూచించారు. కరోనా పుకార్లతో ఎవరూ భయపడవద్దని... అయితే, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.