నేడు అయోధ్యకు వెళ్తున్న థాకరే.. కరోనా నేపథ్యంలో హారతి కార్యక్రమానికి దూరం!
- ముంబై నుంచి లక్నో చేరుకున్న ఉద్ధవ్ థాకరే
- సాయంత్రం 4.40 గంటలకు రోడ్డు మార్గంలో అయోధ్యకు పయనం
- వైద్య అధికారుల సూచన మేరకు హారతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామన్న సంజయ్ రౌత్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేడు అయోధ్యకు వెళుతున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉద్ధవ్ థాకరే ముంబై నుంచి లక్నో చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు అయోధ్యకు ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరుతారు.
శివసేన అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన అయోధ్యకు వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా అయోధ్యలోని రామ మందిరంలో థాకరే పూజలు నిర్వహించనున్నారు. అయితే ఎంతో ప్రఖ్యాతిగాంచిన సరయూ నదిలో నిర్వహించే హారతి కార్యక్రమానికి మాత్రం ఆయన దూరంగా వుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు.
ఈ సందర్భంగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, వైద్య అధికారుల సూచన మేరకు హారతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిపారు.