'మెన్స్‌ డేని జరుపుకోం.. మరి ఉమెన్స్‌ డే ఎందుకు?: హీరోయిన్‌ రకుల్‌

'మెన్స్‌ డేని జరుపుకోం.. మరి ఉమెన్స్‌ డే ఎందుకు?: హీరోయిన్‌ రకుల్‌
  • ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి
  • అదే నిజమైన మహిళా దినోత్సవం
  • ఉమెన్స్‌ డేని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం ఏంటి 
  • హోలీ ఆడటం పదో తరగతిలోనే ఆపేశా 
మెన్స్‌ డేని ప్రత్యేకంగా జరుపుకోమని.. మరి ఉమెన్స్‌ డే ఎందుకని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్ ప్రశ్నించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడింది. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, అదే నిజమైన మహిళా దినోత్సవమని తాను భావిస్తానని చెప్పుకొచ్చింది.

ఈ దినోత్సవం జరుపుకోవాలన్న ఆలోచనను తాను పెద్దగా నమ్మనని, ఉమెన్స్‌ డేని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం ఏంటని, ఆ స్ఫూర్తిని ప్రతిరోజూ జరుపుకోవాలని రకుల్ తెలిపింది. ఈ ఏడాది హోలీ  రోజున కూడా తనకు షూటింగ్‌ ఉందని, తాను హోలీ ఆడటం పదో తరగతిలోనే ఆపేశానని చెప్పింది. సంబరం కోసం చేసుకునే హోలీ వల్ల నీళ్లు వృథా అవుతాయన్న అవగాహన వచ్చింది అప్పుడేనని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో కేవలం రంగులతోనే ఆడేవాళ్లమని తెలిపింది. ప్రస్తుతం అది కూడా తగ్గించేశామని చెప్పింది. 


More Telugu News