సిగ్గు, శరం లేని మనిషి: విజయసాయిరెడ్డి విమర్శలు
- స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రతాపరెడ్డితో కేసు వేయించి కొట్టేయిస్తాడు
- మళ్లీ బీసీ నాయకులను ఉసిగొల్పుతాడు
- కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారంటాడు
- లిటిగేషన్ మొదలు పెడతాడు
బీసీల రిజర్వేషన్‌ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్ష విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా, 59.85 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశిస్తూ.. రిజర్వేషన్లు 50శాతం దాటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి స్పందించారు.
'స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డితో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి' అంటూ విమర్శలు గుప్పించారు.