తాజ్ మహల్ ను మూసేయండి: కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆగ్రా మేయర్
- తాజ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు
- కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది
- కరోనా అదుపులోకి వచ్చేంత వరకు పురాతన కట్టడాలను మూసేయండి
కరోనా వైరస్ నేపథ్యంలో తాజ్ మహల్ ను మూసేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆగ్రా మేయర్ నవీన్ కుమార్ జైన్ కోరారు. తాజ్ ను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని... ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు తాజ్ మహల్ తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ కోట, ఇతర పురాతన కట్టడాలను పర్యాటకులు సందర్శించకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఓ లేఖ రాశారు.
మరోవైపు, కరోనా ప్రబలకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. తాజ్ ను చూసేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను పరీక్షించిన వైద్యాధికారులు... వారిలో 708 మందిని ఐసొలేషన్ వార్డుకు పంపించారు. వీరిలో కరోనా లక్షణాలు ఉండటంతో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.