కరోనా ఎఫెక్ట్.. ఐఫా ఉత్సవం వాయిదా
- భోపాల్‌లో ఈ నెలాఖరున జరగాల్సి వున్న ఐఫా వేడుకలు
- ప్రభుత్వ సూచనతో వాయిదా వేసిన నిర్వాహకులు
- మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించని వైనం
కరోనా వైరస్ కలకలంతో పలు కార్యక్రమాలు రద్దవుతున్నాయి. వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు కార్యక్రమాలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేస్తున్నారు. తాజాగా, ఈ నెల చివరన భోపాల్‌లో జరగాల్సిన 21వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల (ఐఫా) ఉత్సవాన్ని వాయిదా వేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సూచనతో వేడుకల్ని వాయిదా వేసినట్టు తెలిపిన నిర్వాహకులు మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ మాత్రం చెప్పలేదు.
భయపెడుతున్న కరోనా కారణంగా విశ్వ క్రీడా పండుగ ఒలింపిక్స్ నిర్వహణపైనా సందిగ్ధం నెలకొనగా, తాజాగా నేపాల్‌లో నిర్వహించాల్సిన లీగ్ క్రికెట్ ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వాయిదా వేశారు. ఐపీఎల్‌పైనా సందిగ్ధం నెలకొనగా, నిర్వహించి తీరుతామని బీసీసీఐ చీఫ్ గంగూలీ స్పష్టం చేశాడు.