ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: మంత్రి ఆళ్ల నాని

ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: మంత్రి ఆళ్ల నాని
  • కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న మంత్రి
  • సరైన జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని సూచన
  • ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కరోనా వైరస్ కలకలంపై స్పందించారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. 24 మంది అనుమానితుల్లో 20 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. మిగతా 4 కేసుల్లో రేపు రిపోర్టు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేదని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారినపడకుండా కాపాడుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాస్కులను బ్లాక్ లో అమ్మినందుకు రెండు షాపులపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.


More Telugu News