సీఎం జగన్​ అరాచక పాలనకు ఈ ఘటన పరాకాష్ట: నారా లోకేశ్​ ఫైర్​

  • మా యువనాయకుడు అవినాశ్ ఆత్మహత్యకు యత్నించాడు
  • అలాంటి పరిస్థితిని జగన్ ప్రభుత్వమే కల్పించింది
  • జగన్ సైకోయిజానికి ‘జై’ కొడుతూ పోలీసులు తప్పు చేస్తున్నారు 
సీఎం జగన్ పై, పోలీసులపై టీడీపీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ అరాచకపాలనకు శ్రీకాకుళంలో ఇవాళ జరిగిన ఘటనే నిదర్శనమంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీడీపీ యువనాయకుడు అవినాశ్ తన ఆవేదనను వ్యక్తం చేసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందిస్తూ, పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, బీసీ వర్గానికి చెందిన టీడీపీ యువనాయకుడు అవినాశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితిని కల్పించారంటూ దుయ్యబట్టారు. జగన్ సైకోయిజానికి ‘జై’ కొడుతున్న పోలీసులు చేస్తున్న తప్పులకి మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు.


More Telugu News