ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రేపు విడుదల చేస్తాం: ఈసీ రమేశ్ కుమార్
- సీఎస్, డీజీపీ, అధికారులతో సమావేశం నిర్వహించాం
- అలాగే రాజకీయపార్టీల నేతలతో కూడా
- ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూలత ఉందని అధికారులు నిర్ధారించారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రేపు విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారని, ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూలత ఉందని నిర్ధారణకు వచ్చారని చెప్పారు.
రాజకీయపార్టీల నేతలతో కూడా సమావేశం నిర్వహించామని, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి సింగిల్ విండో అనుమతి ఇవ్వాలని కోరారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నారని, అవసరమైతే, గ్రామ కార్యదర్శులు, అంగన్ వాడీలను వినియోగిస్తామని వివరించారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.