ఐపీఎల్ కు ముందు చుక్కలు చూపిస్తున్న హార్దిక్ పాండ్య... ముంబయిలో సిక్సర్ల వాన

  • మొన్న 39 బంతుల్లో 105 పరుగులు చేసిన పాండ్య
  • ఇవాళ 55 బంతుల్లో 158 నాటౌట్
  • ఏకంగా 20 సిక్సర్లు బాదిన పాండ్య
గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్య మరింతగా విజృంభిస్తున్నాడు. ముంబయిలో జరుగుతున్న డీవై పాటిల్ టి20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవలే కాగ్ జట్టుపై 39 బంతుల్లో 105 పరుగులు చేసిన పాండ్య, ఇవాళ బీపీసీఎల్ జట్టుపై విశ్వరూపం ప్రదర్శించాడు. రిలయన్స్-1 టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డాషింగ్ ఆల్ రౌండర్ ఈసారి 55 బంతుల్లో అజేయంగా 158 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 20 సిక్సర్లున్నాయంటే పాండ్య ఊచకోత ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడైన పాండ్య గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత పూర్తి ఫిట్ నెస్ సాధించి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు తానెంత తహతహలాడిపోతున్నాడో తాజా ఇన్నింగ్స్ లతో చాటాడు. మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా పాండ్య మెరుపుదాడులు క్రికెట్ పండితులను విస్మయానికి గురిచేస్తున్నాయి.


More Telugu News