అర్హత ఉందో, లేదో సంచయిత ఆలోచించుకోవాలి: విష్ణుకుమార్ రాజు

  • మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత నియామకం
  • ఇది ముమ్మాటికీ రాజకీయ రాక్షస క్రీడ అన్న విష్ణుకుమార్ రాజు
  • ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాలకు తూట్టు పొడిచారని వ్యాఖ్య
సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత అశోక్ గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంచయిత నియామకం ముమ్మాటికీ రాజకీయ రాక్షస క్రీడేనని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. పీవీజీ రాజు కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు తూట్లు పొడిచారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింహాచలం దేవస్థానానికి సంచయిత ఎన్నిసార్లు వచ్చి ఉంటారని ప్రశ్నించారు. సంచయిత ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ట్రస్టు చైర్ పర్సన్ గా తనకు అర్హత ఉందో? లేదో? ఆమె ఒసారి ఆలోచించుకోవాలని అన్నారు.


More Telugu News