‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్​ విడుదల

  • ‘కరోనా’ విషయంలో ఆందోళన వద్దు
  •  వదంతులు, నిరాధార ప్రచారాలను నమ్మొద్దు
  •  ‘కరోనా’ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూంకు తెలియజేయాలి: కేఎస్ జవహర్ రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ‘కరోనా’ విషయంలో ఆందోళన వద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. వదంతులు, నిరాధార ప్రచారాలను నమ్మొద్దని, ‘కరోనా’ అనుమానితుల సమాచారాన్ని 0866–2410978 నెంబర్ ద్వారా కంట్రోల్ రూంకు తెలియజేయాలని సూచించారు.

కరోనా వైరస్ లక్షణాలుంటే తక్షణమే మాస్క్ ధరించాలని, విదేశాల నుంచి వచ్చిన 361 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ‘కరోనా’ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకూ ఏపీలో పాజిటివ్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.  కరోనా’ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామని, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని వివరించారు.


More Telugu News