రేవంత్ రెడ్డి ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిపోయి అరెస్ట్ చేయడం దారుణం: దాసోజు శ్రవణ్
- తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదు
- "ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే" అన్నట్లు ఉంది
- ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి ఇది నిదర్శనం
- బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను న్యాయమూర్తి ఆదేశాలతో 14 రోజుల రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
'తెలంగాణ గవర్నమెంట్ వైఖరి "ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే" అన్నట్లు ఉంది. రేవంత్ రెడ్డి ఆధారాలతో పాటు చేసిన ఫామ్‌హౌస్ ఆరోపణలపై విచారణ జరిపించాల్సింది పోయి, ఆయనను అరెస్టు చేయడం తెలంగాణ ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం. బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలి' అని శ్రవణ్ డిమాండ్ చేశారు.