కరోనాపై ఆందోళన వద్దు...ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
- వైద్యసిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు
- వ్యక్తిగతంగా మనం కూడా జాగ్రత్తలు పాటించాలి
- దూరప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో వస్తున్న ఊహాగానాలు, ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారు. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉందని, వైద్య సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ఓ మెసేజ్ ఉంచారు. ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోందని, మన బాధ్యతగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని పిలుపునిచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలని, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే 0866-2410978 నంబర్‌కు ఫోన్‌చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు.