ఈ వీడియో చూసిన వెంటనే ఆంటీలకు అభిమానిగా మారిపోయా: ఆనంద్ మహీంద్రా
- పుణేలో మధ్య వయసు మహిళ తెగువ
- ఫుట్ పాత్ పై బైకు నడుపుతున్న యువకుడ్ని అడ్డుకున్న వైనం
- ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను సత్కరించాలని సూచన
- లేదంటే మరో తేదీన అంతర్జాతీయ ఆంటీల దినోత్సవం జరపాలని పిలుపు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఇటీవలే పుణేలో గోఖలే అనే ఓ మధ్య వయసు ఉపాధ్యాయురాలు ఫుట్ పాత్ పై బైకు నడుపుతున్న యువకుడ్ని ధైర్యంగా నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఈ వీడియోలో కనిపించిన మహిళ తెగువ తనను విపరీతంగా ఆకట్టుకుందని, ఈ వీడియోతో తాను ఆంటీలకు అభిమానిగా మారిపోయానని వెల్లడించారు. ఆమె తెగువ అంతటితో ఆగిపోరాదని, మరింత బలం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పుణే మహిళను సత్కరించాలని సూచించారు. లేని పక్షంలో మరో తేదీన అంతర్జాతీయ ఆంటీల దినోత్సవం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.