రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని మరోసారి తేలింది: జీవీఎల్​

  • ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనే ఇందుకు నిదర్శనం
  • కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదు
  • ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని రాజకీయ తీర్మానం చేశాం
  • అంతమాత్రాన చట్టాలను మార్చాలనడం కరెక్టు కాదు
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు అంశం ‘కేంద్రం పరిధిలోది‘ అని  కొందరు, ‘కాదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ఉత్తరాఖండ్ తమ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు.

ఢిల్లీలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధానిని నిర్ణయించుకునే అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అని, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్న విషయం ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనతో తేలిపోయిందని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతూ రాజకీయంగా బీజేపీ తీర్మానం చేసిందని, అంతమాత్రాన చట్టాలను మార్చి రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరడం సబబు కాదని అన్నారు.


More Telugu News