కరోనా వైరస్ పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • కరోనా మహమ్మారి గుట్టు విప్పే క్రమంలో ముందడుగు
  • కరోనా జన్యుక్రమాన్ని గుర్తించినట్టు వెల్లడి
  • వైరస్ కు సంబంధించి కావాల్సినంత సమాచారం ఉందన్న ఆరోగ్య సంస్థ
ఇటీవల కాలంలో ఎబొలా వైరస్ తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న వైరస్... కరోనా వైరస్! వేల సంఖ్యలో మరణాలతో ఈ మహమ్మారి చైనా సహా అనేక దేశాలకు ప్రబల విరోధిలా మారింది. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ భూతం ఇతర దేశాలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ గుట్టు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందడుగు వేసింది. ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలు, తద్వారా నివారణ మార్గం తెలుసుకునే క్రమంలో తాము కీలక సమాచారం రాబట్టినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ వెల్లడించారు.

కరోనా వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాలిమిరేజ్ చైన్ రియాక్షన్, సీరాలాజికల్ అనాలిసిస్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు తమ వద్ద కరోనాకు సంబంధించి ఎంతో సమాచారం ఉందని, చాలా తక్కువ సమయంలో కావాల్సినంత సమాచారం రాబట్టడం మామూలు విషయం కాదన్నారు.


More Telugu News